ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలు రుణం తీర్చుకునే సమయం వచ్చింది' - dokka

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెదేపాతోనే భరోసా అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పడిన కష్టానికి ప్రజలు రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్

By

Published : Mar 11, 2019, 7:32 PM IST

ఎమ్మెల్సీ డొక్కా
లోటు బడ్జెట్​తో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి బాటలో నడుపుతున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెదేపా భరోసా ఇస్తుందని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేశారని పేర్కొన్నారు. ఎన్నికల తరుణంలో.. ప్రజలు ముఖ్యమంత్రి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పారు.సీఎం చంద్రబాబు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తెదేపాకు తిరిగి అధికారం అందిస్తాయన్నారు.సీటు రాలేదన్న కారణంతోనే కొందరు నేతలు పార్టీలు మారుతున్నారని డొక్కా అన్నారు. చంద్రబాబు నాయకత్వం కావాలన్న అలీ వైకాపాలో చేరాడానికి ఇదే కారణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details