ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి 1న కనకదుర్గ పైవంతెన ప్రారంభం! - కనకదుర్గ పైవంతెన జనవరి 1న ప్రారంభం...!

విజయవాడలో నిర్మాణంలో ఉన్న కనకదుర్గ పైవంతెన పనులను మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెల్లంపల్లి శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి చేసి జనవరి 1న వంతెన ప్రారంభిస్తామని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు

కనకదుర్గ పైవంతెన జనవరి 1న ప్రారంభం...!

By

Published : Jun 16, 2019, 12:24 PM IST

Updated : Jun 16, 2019, 4:28 PM IST

కనకదుర్గ పైవంతెన పనుల పరిశీలన
ప్రతిష్ఠాత్మకంగా 311 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న దుర్గ గుడి పైవంతెన నిర్మాణ పనులను మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలు, పురోగతి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకే కనకదుర్గ పైవంతెన పనులు ఆలస్యమయ్యాయని మంత్రి విమర్శించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి చేసి జనవరి 1న వంతెన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అకృతుల మార్పు, అదనపు నిర్మాణాల వల్లే వ్యయం ఎక్కువైందని, పనుల ఆలస్యం వల్ల అదనపు వ్యయం కాలేదన్నారు.
ఈ పైవంతెన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో భాగంగా నాలుగు వరుసల రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 90 శాతం విస్తరణ పనులు పూర్తయ్యాయి. నాటి సీఎం చంద్రబాబే స్వయంగా ప్రతి నెలా సమీక్షించేవారు. అయినా పనులు మందకొండిగానే సాగాయి . నూతన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మంత్రి పైవంతెనను జనవరి 1 న ప్రారంభిస్తామని స్పష్టతనిచ్చారు.

కేంద్రం నుంచి నిధులు రావడానికి ఎటువంటి అడ్డంకులు లేవని... త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని రవాణ,భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికృష్ణ బాబు తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నియమ నిబంధనల ప్రకారం తక్కువ బిడ్ వేసిన వారికే కాంట్రాక్ట్ అప్పగించాలి కాబట్టి సోమా కంపెనీకి నిర్మాణ పనులు అప్పగించారే తప్ప... ఇందులో ప్రభుత్వాల తప్పేమీ లేదని వివరించారు.

కనకదుర్గ పైవంతెన జనవరి 1న ప్రారంభం...!
Last Updated : Jun 16, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details