"పాడి పరిశ్రమతో పల్లెల్లో వెలుగులు నింపుతా" - special
ఆంధ్రప్రదేశ్‌ను పాడి పరిశ్రమకు నెలవుగా మార్చుతానని పశుసంవర్థక , మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. మత్సకారులు, రైతులకు అండగా ఉంటూ... వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పారు.
నష్టాలబాటలో నడుస్తున్న పాడి పరిశ్రమను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తానని పశుసంవర్థక , మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. రాష్ట్రానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడంలో కీలకమైన మత్స్యకారులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. పంటకు గిట్టుబాటు లేకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని, వారికి మద్దతు ధర కల్పిస్తామని... అవినీతిని ఉపేక్షించేది లేదంటున్న మంత్రి మోపిదేవి వెంకటరమణతో 'ఈటీవీ భారత్" ముఖాముఖి...