ఇకపై కుటుంబానికి 25వేల కనీస ఆదాయం! - minimum income
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకు 25 వేల కనీస ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఉపాధి, ఆదాయంపై శాసన సభలో మాట్లాడుతున్న సీఎం
విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 వేల కనీస ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13.5 లక్షల మందికి ఉపాధి లభించేలా పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు.
Last Updated : Feb 8, 2019, 6:28 PM IST