ఈనెల 30న అమరావతిలో చేపట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ మాదిగ విజయవాడలో నిరసనకు దిగారు. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా చంద్రబాబు... ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, కమిషన్ ఛైర్మన్ పదవులు మాల సామాజిక వర్గానికి ఇచ్చారని మండిపడ్డారు. పెద్ద మాదిగ అవుతాం అని చెప్పి... అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అంశాన్ని విస్మరించారన్నారు. త్వరలో సదస్సు ఏర్పాటుచేసి ఎవరికి మద్దతివ్వాలి అనే అంశంపై నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.