మోదీ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ట్విట్టర్లో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడు మోదీ అని మండిపడ్డారు. కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా... ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి తమ ముఖ్యమంత్రి చంద్రబాబు అని కితాబునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబున్నారని, హెరిటేజ్ సంస్థని చూసుకోవడానికి బ్రాహ్మణి, భువనేశ్వరి ఉన్నారన్నారు. జగన్ అక్రమాస్తుల హెరిటేజ్ కి మోదీ చౌకీదార్‌గా మారారన్నారు. 54 వేల కోట్లయ్యే పోలవరం ప్రాజెక్ట్‌కి 6 వేలకోట్లిచ్చి పూర్తి చేయలేదంటున్నారని,... మీకు లెక్కలు రావా అని మోదీని ప్రశ్నించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కే లేదా అన్న లోకేశ్.... గుజరాత్‌లో నరమేథం సాగించిన మోదీ..అరవీర భయంకరులైన మీరు భళ్లాలదేవుడికి సరిసాటని అన్నారు. కాలకేయుడికి మీరే పోటీ అని అన్నారు.