రాష్ట్రంలో పగపట్టిన పాములు రాజ్యమేలుతున్నాయంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైకాపా నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వర్షాకాలంలో పాములు బైటికొచ్చి భయపెడుతున్న రీతిలో వైకాపా నేతల తీరు ఉందని ధ్వజమెత్తారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేఖర్లపై పగదీర్చుకుంటామని వైకాపా నేత చేసిన బెదిరింపును లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. వైకాపా ఎమ్మెల్యే గణేష్ సాక్షిగానే ఆ నేత బెదిరిస్తున్న ప్రసంగం వీడియోను ట్వీట్టర్ ద్వారా బహిర్గతం చేశారు .
ఆ విలేఖరుల సంగతి మేం చూసుకుంటాం.. వైకాపా నేత బెదిరింపు... ట్విట్టర్లో లోకేశ్ - lokesh twitter
తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా నేతలపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పక్కన ఉండగానే... ఆ పార్టీ నేతలు విలేకర్లను బెదిరించే వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వైకాపా నేత బెదిరింపు... ట్విట్టర్లో లోకేశ్ పోస్ట్
Last Updated : Jul 9, 2019, 11:48 AM IST