తెదేపాలోకి వైకాపా మహిళా అధ్యక్షురాలు - kolli nirmalakumari in tdp
వైకాపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి తెదేపాలో చేరారు. మంత్రి నారా లోకేష్ ఆమెకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెదేపాలో చేరికలు
By
Published : Mar 9, 2019, 10:04 PM IST
తెదేపాలో చేరికలు
అధికార తెదేపాలోకి ప్రతిపక్షం నుంచి వలసలు కొనసాగుతున్నాయి.వైకాపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి... మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఆమెతో పాటు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన నేతలు తెదేపా కండువా వేసుకున్నారు.వైకాపాలో అవమానాలు భరించలేకే మహిళా దినోత్సవం రోజే రాజీనామా చేశానని నిర్మలతెలిపారు. తన ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వరనే ధీమాతో తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు.