'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం' - vijayawada singpur flight
తెదేపా ఎంపీ కేశినేని నాని.. ఫేస్బుక్ వేదికగా మళ్లీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రజావేదిక కూల్చివేత, నిలిచిన సింగపూర్ - విజయవాడ విమాన సేవలపై వినూత్న నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై.. తెదేపా లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని.. సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజావేదికను కూలగొట్టిన నిర్ణయానికి తోడు.. చంద్రబాబు హయాంలో సింగపూర్ - విజయవాడ మధ్య రాకపోకలు చేసిన విమాన సేవలు.. తాజాగా జగన్ హయాంలో నిలిచిపోవడంపై.. ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశాల తీరును స్పృశిస్తూ.. ఫేస్బుక్లో సెటైరికల్ పోస్టు చేశారు. ఆ పోస్టుకు.. 'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం' అని కామెంట్‌ను జత చేశారు.