వైకాపా నేతలకు, కార్యకర్తలకు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. వారు జేజేలు కొడుతున్న నేత.. ఏ విషయంలోనూ సమర్థుడు కాడని విమర్శించారు. జగన్ ప్రతిపక్ష హోదాను అపహాస్యం చేశారని ఆరోపించారు. కార్యకర్తలను నీళ్లు లేని బావిలోకి నెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని... ఎన్నికల తర్వాత వైకాపాను భాజపాలో విలీనం చేస్తారన్నారు. ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్తో వైకాపా అధినేత చేతులు కలిపారని మండిపడ్డారు. ఆస్తులు కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
'జగన్ కబంధహస్తాల నుంచి బయటకు రండి..' - letter
వైకాపా నేతలకు, కార్యకర్తలకు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. వారు జేజేలు కొడుతున్న నేత.. ఏ విషయంలోనూ సమర్థుడు కాడని విమర్శించారు. జగన్ ప్రతిపక్ష హోదాను అపహాస్యం చేశారని ఆరోపించారు.
జగన్ స్వార్థానికి కార్యకర్తల బతుకులు నాశనం చేశారని ఆరోపించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న శ్రేణులకు తెదేపా పదేళ్లలో 90 కోట్లు ఖర్చు చేసిందని... వైకాపా తన కార్యకర్తలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. 31 కేసులున్న వ్యక్తిని నమ్మి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా అని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. పోలింగ్ ముగిశాక వైకాపా దుకాణం మూసేయడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ ను నమ్ముకుంటే కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. జగన్ కబంధహస్తాల నుంచి బయటకు రండి అని పిలుపునిచ్చారు.