ETV Bharat / state
'జగన్ భవిష్యత్తు... కేసీఆర్ బాధ్యత ' - data theft
'ప్రజల భవిష్యత్తు మా బాధ్యత' నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే... జగన్ భవిష్యత్తుని తన బాధ్యతగా తీసుకుని కేసీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. 22 ప్రశ్నలతో కేసీఆర్‌కు లేఖాస్త్రాన్ని సంధించారు. కుట్రలను ఛేదించి... ప్రజాదరణతో తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కి కళా లేఖాస్త్రం
By
Published : Mar 11, 2019, 1:59 PM IST
| Updated : Mar 11, 2019, 2:41 PM IST
కేసీఆర్‌పై కళా లేఖాస్త్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావు 22 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. ఐటీ గ్రిడ్‌పైన చట్ట వ్యతిరేకంగా దాడులు చేయడం, దుష్ప్రచారంచేయించడం కేసీఆర్ స్థాయికి తగునా అని ప్రశ్నించారు. 20 ఏళ్లకుపైగా కష్టపడి సేకరించిన తెదేపా సమాచారాన్ని దొంగిలించి జగన్‌కి ఎలా కట్టబెట్టారని అడిగారు. తెలంగాణలో ఓట్లు తొలగించి... ఇప్పుడు అదే పద్ధతిని ఏపీలో అమలు చేసేందుకు ప్రయత్నించింది నిజం కాదా అని నిలదీశారు. ఏపీ ప్రజల భవిష్యత్తును చంద్రబాబు బాధ్యతగా తీసుకుంటే... జగన్ భవిష్యత్తును మీరు బాధ్యతగా తీసుకున్నారా అనిప్రశ్నించారు.ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ యాప్, భాజపా పన్న ప్రముఖ్, నమో యాప్, తెరాస తెలంగాణ మిషన్ యాప్‌తో ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు సేకరించినప్పుడు తప్పు లేదు కానీ.. తెదేపా కార్యకర్తల వివరాల నమోదుకు యాప్ తయారు చేస్తే నేరమా అని అడిగారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే రాష్ట్రాన్ని దెబ్బతీసేందుకు జగన్‌కు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. డేటా చోరీ కుట్రను ఆధారాలతో సహా బయటపెడితే ఎందుకు స్పందించలేదని వాగ్భాణాలు సంధించారు. భాజపా ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ఎన్నికలను మొదటి విడతలోనే తీసుకొచ్చారని ఆరోపించారు. కుట్రలను ఛేదించి... ప్రజాదరణతో తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. Last Updated : Mar 11, 2019, 2:41 PM IST