ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా, వైకాపా, కాంగ్రెస్ లు మా బీ - ఫారమ్​లు దొంగిలించాయి - compliant

ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులకు కేటాయించే బీ-ఫారమ్​లు చోరీకి గురయ్యాయని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలే ఈ నేరానికి పాల్పడ్డాయని ఆరోపించారు. తక్షణం దీనిపై విచారణ చేయాలని.. అప్పటి వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని విజ్ఞప్తి చేశారు.

కేఏ పాల్

By

Published : Mar 31, 2019, 4:45 AM IST

కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులకు కేటాయించే బీ-ఫారమ్​లు చోరీకి గురయ్యాయని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలే ఈ నేరానికి పాల్పడ్డాయని ఆరోపించారు. తక్షణం దీనిపై విచారణ చేయాలని.. అప్పటి వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని విజ్ఞప్తి చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని.. ఆ పార్టీకి ఓటు వేయొద్దంటూ పిలుపునిచ్చారు. తనకు భద్రత కల్పించాలని కోరినా ఇప్పటి వరకూ పట్టించుకోలేదని ఈసీకి విన్నవించారు. జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని ఆరోపించారు. డీజీపీతో పాటు కొందరు ఎస్పీలను మార్చాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం తనకి లేదన్నారు. భీమవరం, నర్సాపురంలో రోడ్ షోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details