సీఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో జగన్ ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. దొంగ ఓట్లు చేరుస్తున్నారని సీఈసీ సునీల్ అరోరాకు ఫిర్యాదు చేశారు. ఒకే ఓటును రెండుగా నమోదు చేయిస్తున్నారని... అదే సమయంలో వైకాపా సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. సర్వేల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని... పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఈసీకి వివరించారు.