ఆర్థిక నేరగాడైన జగన్ అధికారంలోకి వస్తే అవినీతిలేని పాలన అందిస్తామనడం విడ్డూరంగా ఉందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు
By
Published : Mar 18, 2019, 11:09 PM IST
చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఆర్థిక నేరాల్లో సుమారు 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ అనేక మంది ఐఏఎస్ , ఐపీఎస్లను బెదిరించారని ఆరోపించారు.