కోరం లేక.. ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం వాయిదా - ప్రవీణ్‌కుమార్
విజయవాడలో జరగాల్సిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సమావేశానికి 9 మంది సీనియర్ ఐఏఎస్, నలుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు మాత్రమే హాజరైనందున వాయిదా వేసినట్లు ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
విజయవాడలో జరగాల్సిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్లు సంఘం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. చాలామంది ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారన్న ప్రవీణ్‌కుమార్...సర్వసభ్య సమావేశానికి కోరం లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. 184 మంది సభ్యులకు గాను... 14 మంది మాత్రమే హాజరైనట్లు ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కోరం కోసం 46 మంది హాజరుకావాల్సి ఉండగా... అంతమంది హాజరుకాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై చేసిన అనుచిత వ్యాఖ్యలే అజెండాగా సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యులు లేక ఆ అజెండాపై చర్చించేందుకు వీల్లేకుండా పోయిందని ప్రవీణ్ కుమార్ వివరించారు.