ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొరుగింటి గొడవలే.. ఆమె ఆత్మహత్యకు కారణం: హోంమంత్రి - ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు

మహిళల భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత.

mekatoti and babu

By

Published : Jul 17, 2019, 5:53 AM IST

శాసనమండలి

రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మహిళల భధ్రతపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లోనూ ఓ మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో తెదేపా కార్యకర్త ఆత్మహత్య, కృష్ణా జిల్లాలో ఆశా కార్యకర్త ఆత్మహత్యా యత్నంపై తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే చినగంజాంలో మహిళ ఆత్మహత్యకు పొరుగింటి వారితో గొడవలే కారణమని మంత్రి వివరించారు. రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మచిలీపట్నంలో ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details