ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వచ్చిన నెలకే హామీలు నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నాం' - home minister

జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను తొలగించేందుకు ఎక్సైజ్​ శాఖకు ఇప్పటికే పోలీసు శాఖ తరపున కొన్ని సూచనలు చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

మేకతోటి సుచరిత

By

Published : Jun 28, 2019, 7:27 PM IST

మేకతోటి సుచరిత

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా చేపడతామని... ఇప్పటికే జిల్లా కలెక్టర్ల సదస్సులోనూ సీఎం ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారని మంత్రి వెల్లడించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను తొలగించేందుకు ఎక్సైజ్​శాఖకు ఇప్పటికే పోలీసు శాఖ తరపున కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. అక్టోబరు 1 నాటికి బెల్టు దుకాణాలను తొలగించాలని సీఎం స్పష్టం చేశారని.. పోలీసు విభాగం తరపున వీటిపై స్పష్టమైన కార్యాచరణ చేపడతామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details