ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిఘా నీడలో సార్వత్రిక ఎన్నికలు - నిఘా

ఎన్నికల నగరాతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు విస్తృత ప్రయత్నాలు మొదలు పెట్టాయి. వాటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిఘా నీడలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

తనీఖీలు చేపట్టిన పోలీసులు

By

Published : Mar 14, 2019, 3:51 PM IST

తనీఖీలు చేపట్టిన పోలీసులు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో రాజకీయ పార్టీల హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లను ఈసీ తొలగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వాధినేతల ఫొటోలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఫిర్యాదుల పరిష్కారంతో పాటు నిఘా కోసం 6500 పైచిలుకు ఫ్లయింగ్ స్క్వాడ్, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు సిద్ధం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ 160 బృందాల సాయంతో విస్తృత తనిఖీలు చేస్తోంది.

ప్రలోభాల పర్వం

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల ప్రలోభాలు, నగదు పంపిణీ ఇతర అంశాలపై ఈసీ దృష్టి సారించింది. కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ భారీ మొత్తంలో నగదు, ఇతర వస్తువులను పట్టుకున్నారు. 29 కోట్ల 91 లక్షల రూపాయల పైచిలుకు నగదు స్వాధీనంచేసుకున్నారు. 13.5 కేజీల బంగారం , 31 కేజీల వెండి జప్తు చేసినట్టు ఎన్నికల సంఘం తెలియచేసింది. వీటిని తరలిస్తున్న 70 వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details