"లక్ష్మీపార్వతి కేసులో ప్రమాణపత్రం దాఖలు చేయండి" - High Court directive to file affidavit in Laxmiparvathi case
తనపై అభ్యంతరకరమైన ఆరోపణలతో కేసు నమోదు చేయటంపై లక్ష్మీపార్వతి హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆమెపై ఫిర్యాదు చేసిన కోటి, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ... కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా చేసింది.
తనపై అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు నమోదు చేసిన కేసుపై లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించారు. కేసును సీఐడికి అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటీషన్పై విచారణ జరిగింది. ఆమెపై ఫిర్యాదు చేసిన కోటి, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ...కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా చేసింది. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారంటూ.. కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండలో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయటంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, కేసును సీఐడీకి అప్పగిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటీషనర్ పేర్కొన్నారు.