ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్తగా 4 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు

By

Published : Feb 12, 2019, 9:41 PM IST

రాష్ట్రంలో నూతనంగా 4 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం (సుడా), బొబ్బిలి (బుడా), పలమనేరు-కుప్పం-మదనపల్లి (పీకేఎం-ఉడా), చిత్తూరు (చుడా) పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది.

కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఉత్తర్వులు

రాష్ట్రంలో కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు - కుప్పం - మదనపల్లి పట్టణాలను కలుపుతూ పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలెవన్ ఆదేశాలిచ్చారు. ప్రత్యేకంగా చిత్తూరు పట్ణణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన పీకేఎం-ఉడా పరిధిలో 12 మండలాలు, 376 గ్రామాలను చేర్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు 22 మండలాలు, 434 గ్రామాలను చిత్తూరు అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఉత్తర్వులు

శ్రీకాకుళం అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధిలోకి... 968 గ్రామాలతో పాటు ఇచ్చాపురం, పాలకొండ, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలను చేర్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ (బుడా) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 572 గ్రామాలు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలను బుడా పరిధిలోకి తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details