గ్రామ వాలంటీర్ల నియామకం ద్వారా రేషన్ డీలర్లను తొలగిస్తారన్న వార్తలు వ్యాపిస్తున్నాయని అదే జరిగితే 30 వేల కుంటుంబాలు రోడ్డున పడతాయని తెదేపా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాపోయారు. అలా కాకుండా అర్హత ఉన్న డీలర్లనే గ్రామ వాలంటీర్లుగా తీసుకొని వారి ద్వారా సరుకులు పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
'రేషన్ డీలర్లను తొలగిస్తే రోడ్డుపాలవుతారు' - they'll be on the road
రేషన్ డీలర్ల ద్వారానే ప్రజలకు సరుకులు పంపిణీ చేయించాలని తెదేపా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం వల్ల డీలర్లను తొలగిస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి