ETV Bharat / state
నేటి నుంచే 9 గంటల ఉచిత విద్యుత్ - forming
వ్యవసాయానికి సాయం అందించడమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయానికి అందించే 7 గంటల విద్యుత్ సరఫరాను 9 గంటల పెంచుతూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని నేటి నుంచి అమలుచేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ తెలిపింది.
ద్యుత్ సరఫరాను 9 గంటలు
By
Published : Feb 17, 2019, 6:14 AM IST
| Updated : Feb 17, 2019, 7:31 AM IST
సీఎం చంద్రబాబు అన్నదాతలకు ప్రకటించిన విద్యుత్ పెంపును నేటి నుంచి అమలుచేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ తెలిపింది. 8 జిల్లాల రైతులకు నేటి నుంచి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సంస్థ సీఎండీ ఎం నాయక్ ప్రకటించారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ అందించాలన్న సీఎం ఆదేశాలనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తిరుపతిలో తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ సౌకర్యం పెందనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో 14 లక్షల రైతులకు లబ్ధి చేకూరునుందన్నారు. Last Updated : Feb 17, 2019, 7:31 AM IST