కరగని మేగం... కురవని వర్షం... కనిపించని ఆనందం!
కిందటి ఏడాది ఇదే సమాయానికి రైతన్న కళ్లల్లో వర్షానందం. మరోవైపు అదే సమయంలో పట్టిసీమ నీళ్ల రాకతో వ్యవసాయానికి ఢోకా లేకుండా పోయింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా వరుణుడు దోబూచులడుతున్నాడు. నిన్నా.. మెున్నా.. కురిసిన చిరుజల్లులకు కనీసం భూమిపై పొరైనా తడవని పరిస్థితి. వ్యవసాయ కూలీలు సైతం అన్నదాత కరుణ కోసం ఆతృతగా చూస్తున్నారు.
farmers_waiting_for_rain
ఏటికేడు మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రుతువులకు అనుగుణంగా వర్షాలు కురవక... వానల కోసం ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది. ఖరీఫ్ కాలం ప్రారంభమైనా... రుతుపవనాలు విస్తరించినా చిరు జల్లులు తప్ప పెద్ద వర్షాలు పడటం లేదు. పంటలకు సమయం మించిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.