''అప్పటి వరకూ''.. రాజధాని పనులు జరగవు: బుగ్గన - buggana
ఈ నెల12న వైకాపా ప్రభుత్వం.. తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సామాన్య ప్రజలకు భరోసా కలిగించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని...ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
నవతర్నాల హామీల అమలే ప్రధాన అంశాలుగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక రంగాల్లో నిధులు ఖర్చు చేయనుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మౌలికమైన అంశాలపై దృష్టిసారించలేదని విమర్శించిన ఆర్థిక మంత్రి.. అన్ని రంగాలకూ సమానంగానే కేటాయింపులు జరిపామని చెప్పారు. రెవెన్యూలోటు నుంచి బయటపడేందుకు కేంద్ర సాయం కోరుతున్నామని తెలిపారు. అవినీతిపై విచారణ జరిగిన తరువాతే రాజధాని పనులు మొదలవుతాయంటున్న మంత్రి బుగ్గనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.