ఎన్నికలకు పోలీసుల భారీ బందోబస్తు ఏపీ లో జరగనున్న ఎన్నికలకు లక్షా ఆరువేల ఐదువందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలకు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల 725 మందిని బైండోవర్ చేశామన్నారు. ఒకవైపు పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటే... మరోవైపు పోలీసులు ఎన్నికల బందోబస్తుకు రంగం సిద్ధం చేస్తున్నారు.సీఆర్ పీఎఫ్ , బీఎస్ ఎఫ్ ఐటీబీపీ,ఎస్ ఎస్ బీ,ఆర్ పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల నుంచి 392 కంపెనీలు, ఎపీఎస్పీ నుంచి 45 కంపెనీల బలగాలు అవసరమని ఎన్నికల సంఘాన్ని కోరామనిడీజీ తెలిపారు. ఇప్పటికే 90 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయని తెలిపారు .రాష్ట్రవ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 17,671 కేంద్రాలను సాధరణమైనవిగా, 9,345 కేంద్రాలను సమస్యత్మకమైనవిగా గుర్తించాం. వాటి తీవ్రతను బట్టి 3 రకాలుగా విభజించాం. ఇలాంటి చోట్ల కేంద్ర సాయుధ బలగాలను వినియోగించుకుంటాం. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ఒక ఎస్సై ,హెడ్ కానిస్టేబుల్ తో పాటు 10 నుంచి 20 మంది వరకు సాయుధ సిబ్బంది పహారా కాస్తారని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు 940 స్ట్రైకింగ్ ఫోర్సులను సిద్ధం చేయనున్నారు. నియోజక వర్గ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడికి చేరుకునేందుకు 249 ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంచనున్నారు.
కొత్త ఓటరు కార్డులు సిద్ధం