ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక పోరుకు ఎన్నికల సంఘం సన్నద్ధం - ఎన్నికల సంఘం

పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పంచాయతీల సమాయత్తతపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, రాబోయే రోజుల్లో తీసుకోనున్న చర్యలు, సాంకేతికాంశాలు, ఇతర సమస్యల గురించి ప్రధానంగా చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలపైనా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.

స్థానిక పోరుకు ఎన్నికల సంఘం సన్నద్ధం

By

Published : May 3, 2019, 7:20 AM IST

స్థానిక పోరుకు ఎన్నికల సంఘం సన్నద్ధం

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధతపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. 12,918 గ్రామ పంచాయతీల్లో ఫొటోతో సహా ఓటర్ల తుది జాబితా ఈనెల 10న ప్రకటించేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామపంచాయతీల వారీగా పురుషులు, మహిళలు, ఇతరుల ఓటర్ల జాబితాల సీడీలు అధికారులు సిద్ధం చేశారు. 90 శాతం పంచాయతీల్లో ఈ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతంలోపు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో రిజర్వేషన్లు 60.55 శాతంగా నిర్ణయించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. దీన్ని సవాల్‌ చేస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో... అప్పటికి అనుమతించిన సుప్రీంకోర్టు తరువాతి ఎన్నికల్లో 50 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విశాఖ, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, మచిలీపట్నం నగరపాలక సంస్థలతోపాటు మరో తొమ్మిది పురపాలక సంఘాల్లో... ఇదివరకే కొత్త ప్రాంతాల విలీనం చేశారు. వార్డుల పునర్విభజన చేయాల్సి ఉన్నందున ఓటర్ల తుది జాబితాల విడుదలకు గడువు పెంచాలన్న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ విజ్ఞప్తిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. మే ఒకటో తేదీకి బదులు 10న తుది జాబితా వెల్లడించేలా ఆదేశించింది.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పురపాలక సంఘాల్లోనూ గత పది రోజులుగా పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎన్నికల విభాగ ఉద్యోగులు, సిబ్బంది ఇదే పనుల్లో ఉన్నారు. 2013లో కొన్ని చోట్ల కొత్త ప్రాంతాల విలీనంపై కోర్టు కేసులున్నందున వార్డుల పునర్విభజనకు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. అయితే కోర్టు కేసులున్న ప్రాంతాలను మినహాయించి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఇటీవలే స్పష్టం చేసింది. అందుకు 15రోజుల సమయం కావాలన్న పురపాలకశాఖ ఉన్నతాధికారుల విజ్ఞప్తికి ఎన్నికల సంఘం అనుమతించింది.

ABOUT THE AUTHOR

...view details