ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధాని నిర్మాణం' - construction

శాసనసభలో రాజధాని నిర్మాణంపై వాడీవేడి చర్చ జరిగింది. నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపై వేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కొనసాగిస్తామన్నారు.

శాసనసభలో మాట్లాడుతున్న బొత్స

By

Published : Jul 18, 2019, 1:38 PM IST

రాజధాని నిర్మాణంపై వాడీ వేడి చర్చ

శాసనసభలో రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది. రాజధాని పనులు ఎక్కడికి వచ్చాయని.. కేవలం 500 కోట్ల బడ్జెట్​తో నిర్మాణ పనులు ఎలా చేస్తారని మద్దాల గిరిధర్​రావు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణంలోని అవకతవకలు, అవినీతిపై కమిటీ వేశామని నివేదిక వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఆర్​డీఏకు రాజధాని పేరిట గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 1105 కోట్లు మాత్రమే ఇచ్చిందని... ఒక్క ఏడాదిలో రూ.500 కోట్లు ఇచ్చారని తెలిపారు.

అవినీతి సాకుతో రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని... త్వరితగతిన పనులు జరపాలని మద్దాల గిరిధర్​రావు కోరారు. పనులెప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టంగా తెలపాలని అన్నారు. రాజధానిపై వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రజలు గర్వపడేలా నిర్మాణాలు చేస్తామని బొత్స అన్నారు.

ABOUT THE AUTHOR

...view details