ఆంధ్రాకు ధర్మారెడ్డి... ఉత్తర్వులు జారీ - deputation
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఎ.వీ. ధర్మారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్ రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రాకు ధర్మారెడ్డి డిప్యూటేషన్... కేంద్రం నిర్ణయం
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఏ.వీ. ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు పంపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్ ఆఫీసర్‌గా ధర్మారెడ్డి పనిచేశారు. గతంలో టీటీడీకి సేవలందించిన ధర్మారెడ్డికి మరోమారు తిరుమలలో పని చేసే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.