అమరావతి సచివాలయ ప్రాంగణంలో.. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. శనివారం ఉదయం జరగనున్న కార్యక్రమానికి 2 వేల మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సజావుగా నిర్వహించేందుకు అన్ని ముందుస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమానికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 8గంటల 39 నిమిషాలకు సీఎం జగన్ సచివాలయానికి చేరుకుంటారని..., కాన్వాయ్ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మంత్రులు ప్రమాణ స్వీకారం దృష్ట్యా సచివాలయానికి చేరే వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను మరల్చినట్లు చెప్పారు. ప్రమాణ స్వీకారం ఓ పండగలా నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
పండగలా అమాత్యుల ప్రమాణ స్వీకారం: డీజీపీ - arrangments
శనివారం జరగబోయే మంత్రుల ప్రమాణస్వీకారానికి భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కార్యక్రమం ఓ పండుగలా ఉండబోతోందని అన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ