దిల్లీ ధర్మపోరాట దీక్షపై మంత్రులతో చర్చ ఈనెల 11న దిల్లీలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్ష పై మంత్రులు, ముఖ్య నేతలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీక్షలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ వైకాపా, జనసేన తో పాటు అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లేందుకు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అనుచరులతో సహా దిల్లీ రావాలని సీఎం చంద్రబాబు సూచించారు.