ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపటినుంచే సభాపర్వం.. తొలిరోజు సభ్యుల ప్రమాణం - tdp

ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం ఐదు రోజులపాటు పలు కీలక అంశాలపై నవ్యాంధ్ర నూతన శాసనసభ్యులు చర్చలు జరపనున్నారు.

అసెంబ్లీ

By

Published : Jun 11, 2019, 2:22 PM IST

సార్వత్రిక ఎన్నికల అనంతరం.. మొదటిసారి జరగబోతున్న శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపే (బుధవారం) ప్రారంభం కానున్న సమావేశాలు.. 5 రోజుల పాటు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు.. తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం సమావేశంలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నుకుంటారు. ఈనెల 14న... ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. వారాంతం కారణంగా 15, 16వ తేదీల్లో శాసనసభకు సెలవులు. 17, 18న చర్చ అనంతరం.. సమావేశాలు ముగుస్తాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details