'డేటా పార్టీదే' - It data grid
24 ఏళ్లు కష్టపడి సేకరించిన డేటా దొంగిలించి వైకాపాకు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ డేటా అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు
వ్యక్తికైనా, సంస్థకైనా డేటా ఆస్తిలాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అహంభావంతో కేసీఆర్, అసహనంతో జగన్ దుర్మర్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. అహంకారంతో తెరాస నేతలు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏ పార్టీకి లేని పరిజ్ఞానం తెదేపా సొంతమన్నారు. 24 ఏళ్లు కష్టపడి సేకరించిన డేటా దొంగిలించి వైకాపాకు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ డేటా అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ డేటా దొంగిలించి... కేసులు పెడుతున్నారని సీఎం మండిపడ్డారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం చేకూరుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇక ఎవరైనా డేటా హైదరాబాద్‌లో పెడతారా అని ప్రశ్నించారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఫారమ్-7 దుర్వినియోగం చేయడం నేరమని... ఓట్లు తొలగిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. నేరస్తులు ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని ఆరోపించారు.