ముఖ్యమంత్రి జగన్‌కు డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ - passport
విజయవాడలోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి సీఎం జగన్ వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో సాధారణ పాస్‌పోర్ట్ నుంచి డిప్లమేటిక్ పాస్‌పోర్ట్‌ను అధికారులు జగన్‌కు జారీ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ కు విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ పాస్ పోర్టును అందుకున్నారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్‌పోర్ట్ కలిగిన ఆయనకు... విదేశీ ప్రయాణాలకు ప్రోటోకాల్ వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ జారీ అయ్యింది. దీన్ని అందుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. చేతివేలిముద్రలు, ఇతర వివరాలను అధికారులకు సమర్పించారు. మరోవైపు వచ్చే నెల 15 తేదీ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ వైకాపా ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సదస్సుకూ ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.