ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంకెల గారడీ వద్దు...రైతులు చేయి చాచే పరిస్థితి రావద్దు!

ప్రభుత్వ పథకాల కింద ఇచ్చే మొత్తాలు నేరుగా లబ్ధిదారులకే అందాలని బ్యాంకర్లకు సీఎం జగన్ స్పష్టం చేశారు. సాగులో సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న రైతులను..ప్రభుత్వం, బ్యాంకులు కలసి గట్టెక్కించాలని తెలిపారు. వేరు శనగ రైతులకు క్వింటాలుకు 1700 ప్రభుత్వ సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు.

By

Published : Jun 19, 2019, 8:38 AM IST

cm_jagan_meet_with_bankers

సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి హాజరైన సీఎం..ప్రభుత్వ విధానాన్ని బ్యాంకర్ల ముందుంచారు. 2లక్షల 29 వేల 700 కోట్ల రూపాయల రుణ ప్రణాళికను బ్యాంకర్లు ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్రంలో రైతులు సంక్షోభం నుంచి బయటకు రావాలని. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. రాబోయే సంవత్సరంలో 2 లక్షల 29వేల 200 కోట్లతో రుణ ప్రణాళిక ప్రతిపాదనలను బ్యాంకర్ల కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది.

అంకెలు ఎందుకు పెరుగుతున్నాయి

2018–19లో మొత్తంగా లక్షా 15 వందల 64 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయిస్తే..లక్షా 6వేల 560 కోట్లు రైతులకు అందించామని బ్యాంకర్ల కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది. 2019–20లో లక్షా 15వేల కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని తన లక్ష్యాన్ని ముందుంచింది. ఎస్​ఎల్​బీసీ నివేదికలో ఏటా వ్యవసాయ, డ్వాక్రా రుణాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోందని కారణాలు ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. డబ్బంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? పాత రుణాలు రీషెడ్యూల్‌ చేయడం వల్ల పెరుగుతున్నాయా? అని ఆరా తీశారు. పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడం వల్ల అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు సీఎంకు వివరించారు.

అప్పులు జమ చేయొద్దు

రైతులు చేతులు చాచే పరిస్థితి ఉండకూడదని, సంక్షోభంలో ఉన్న సమయాల్లో ఆదుకోవాల్సింది మనమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.25 ఎకరా కన్నా తక్కువ పొలం ఉన్న రైతులు సుమారు 50శాతం ఉన్నారని పంటకు పెట్టుబడి పెట్టే పరిస్థితి వారికి లేదని సీఎం వివరించారు. రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు 12,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఉన్న అప్పులకు జమచేసే వీలే ఉండకూడదని చెప్పారు. భూ యజమానుల హక్కులు కాపాడుతూనే, కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details