ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్మాయా రాజకీయాలు చెల్లవు' - voter

రాష్ట్రంలో 59 లక్షల ఓట్ల తొలిగింపునుకు మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి దశలో 13 లక్షల ఓట్ల తొలగించేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు. వీటి వెనుక ప్రధాన సూత్రధాని జగనే అని ఆరోపించారు.

టెలీకాన్ఫరెన్స్​లో సీఎం

By

Published : Mar 7, 2019, 11:50 AM IST

రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చూసి వైకాపా, తెరాస, భాజపా ఓర్వలేకపోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. మూడు పార్టీలు కలిసి కుట్రలకు పాల్పడుతున్నాయని అమరావతిలో తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్​లో మండిపడ్డారు. ఫారం-7 ద్వారా 58 లక్షల ఓట్లు తొలగించేందుకు వీరు ప్రణాళికలు రచించారని తెలిపారు. తొలి దశలో 13 లక్షల ఓట్లు తొలగించేందుకు యత్నించగా.. సకాలంలో స్పందించి అడ్డుకున్నామని వెల్లడించారు. దీనంతటికీ ప్రధాన సూత్రధారి జగనే అని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ అండతో వైకాపా అధినేత చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. 2 వేల మంది వైకాపా వాళ్లే 8 లక్షల దరఖాస్తులు పెట్టారని స్పష్టం చేశారు. మన డేటా దొంగిలించి ఓట్లు వేయాలని మనకే ఫోన్లు చేస్తున్నారన్నారు. వైకాపా నుంచి ఫోన్లు చేసిన వారికి... తెదేపా డేటా ఎందుకు చోరీ చేశారని నిలదీయాలని పిలుపునిచ్చారు. దొంగలకు ఓట్లు వేయమని ధైర్యంగా చెప్పాలని కోరారు.
తెదేపా యాప్​పై కక్ష
దేశంలో అన్ని పార్టీలకు యాప్​లు ఉంటే తెదేపా యాప్​పైనే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మన డేటా దొంగిలించి ప్రత్యర్థులకు ఇచ్చారని వెల్లడించారు. తెదేపాలో 65 లక్షలమంది కార్యకర్తలు, 5 లక్షలమంది సేవామిత్రలు ఉండగా...వీళ్లందరి సమాచారాన్ని దొంగిలించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస కుట్రలనే ఇక్కడ వైకాపా అమలుచేస్తోందని... ప్రజాసేవలో చెడు పార్టీలు, చెడు వ్యక్తులకు స్థానం లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details