ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మే 23 న ఇండియన్ టైగర్ గా దీదీ: సీఎం - mamatha

''మే 23న ఇండియన్ టైగర్​గా మమతా బెనర్జీని చూస్తారు. మోదీ, అమిత్ షాలు దీదీని ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. అయినా ఆమెను ఏమీ చేయలేరు. ప్రజలపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రయోగాలు చేసి పేదలను, వ్యాపారస్థులను నానా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి మోదీ.'' - ఖరగ్​పూర్ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు

మే23 న ఇండియన్ టైగర్ గా దీదీ: సీఎం చంద్రబాబు

By

Published : May 9, 2019, 5:17 PM IST

Updated : May 9, 2019, 5:26 PM IST

మే 23 న ఇండియన్ టైగర్ గా దీదీ: సీఎం

ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఎన్ని చేసినా మమత పోరాటాన్ని ఆపలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమ బంగలో తృణమూల్ కాంగ్రెస్​ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. తృణమూల్ తరఫున చంద్రబాబు ఖరగ్​పూర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 23 తర్వాత దేశం కొత్త ప్రధానిని చూస్తుందన్నారు. మోదీ - షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... దీదీని ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. 23 తర్వాత ఇండియన్ టైగర్​గా మమతను చూస్తారన్నారు. ఎన్నికల్లో వివక్షత చూపుతున్నారని... ప్రత్యర్థులపై ఐటీ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కేంద్రంపై చంద్రబాబు ఆక్షేపించారు. నోట్ల రద్దు పేరుతో పేదవారిని మోసం చేశారని... అభివృద్ధి ఆగిపోయిందన్నారు. జీఎస్టీతో వ్యాపారస్థులను దివాలా తీసేలా చేశారని ఆరోపించారు. ప్రజల మీద ప్రయోగాలు చేసి మోదీ లాభం పొందారని దుయ్యబట్టారు. ఇవన్నీ ఆలోచించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలే లక్ష్యంతోనే దీదీ నాయకత్వంలో పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Last Updated : May 9, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details