రేపు అమరావతిలో సీజేఐ - cm
అమరావతిలో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పర్యటించనున్నారు.
రేపు అమరావతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పర్యటించనున్నారు. ఉదయం 10.15 గం.కు విజయవాడ నోవాటెల్ నుంచి బయల్దేరి హైకోర్టు భవన శంకుస్థాపన ప్రాంగణానికి విచ్చేస్తారు. అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు శంకుస్థాపన, పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. అనంతరం కోర్టు హాళ్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద సభా కార్యక్రమానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులు హాజరుకానున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, జస్టిస్ గొగోయ్ సహా అతిథులను సన్మానించనున్నారు. భోజనానంతరం ముఖ్యమంత్రితో కలిసి సీజేఐ అమరావతి రాజధాని ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేయనున్నారు.