ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సిట్టింగులకే సీట్లు ' - cm babu

రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం స్థానాలను ఖరారు చేశారు. అనపర్తి, రాజమహేంద్రవరం సిటీ, కొవ్వూరు, నిడదవోలు స్థానాలు ఇంకా ఖరారు చేయలేదు.

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

By

Published : Mar 2, 2019, 9:56 AM IST

Updated : Mar 2, 2019, 4:05 PM IST

రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల నేతలతో మాట్లాడిన సీఎం...రాజానగరం టికెట్ పెందుర్తి వెంకటేష్‌కు... రాజమహేంద్రవరం రూరల్ టికెట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారు చేశారు. గోపాలపురం స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు ఖరారు చేశారు.

అనపర్తి, రాజమహేంద్రవరం సిటీ, కొవ్వూరు, నిడదవోలు స్థానాలు ఖరారు చేయలేదు. సమయాభావం వల్ల నేతలతో మాట్లాడటం కుదరలేదు. కర్నూలు పర్యటన ముగించుకుని వచ్చాక మిగిలిన 4 స్థానాల నాయకులతో భేటీ కానున్నారు.

రాజమహేంద్రవరం టౌన్​కి ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావు పోటీపడుతున్నారు. కొవ్వూరుకు మంత్రి జవహర్ సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉండగా... వేమగిరి వెంకట్రావు, టీవీ రామారావు కూడా ఈ స్థానాన్నే ఆశిస్తున్నారు. నిడదవోలుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శేషారావ్, కుందూరు సత్యనారాయణ పోటీపడుతున్నారు. గోపాలపురం స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు.

రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి నిరాకరించిన మురళీమోహన్... ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలిపారు. రాజమహేంద్రవరంలో బొడ్డు భాస్కర రామారావు... బీఎస్ఆర్, గన్ని కృష్ణ, కెప్టెన్ మూర్తి పేర్లు పరిశీలన ఉన్నాయి.

'సిట్టింగులకే ఖరారు'

ఇదీ చదవండి..

కాకినాడ అభ్యర్థుల ఖరారు

Last Updated : Mar 2, 2019, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details