కేంద్రం తీరుకు నిరసనగా.. దిల్లీ వేదికగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఆయనకు పలువురు జాతీయ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు. సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీలు నెరవేర్చేవరకు అందరూ ఉండగా ఉంటామని తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. తాము చేసే పనిలో న్యాయం ఉందని పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమన్నారు.