ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐటీసీ ఛైర్మన్ మృతికి చంద్రబాబు, లోకేశ్ సంతాపం - chandrababu_tweet

ఐటీసీ ఛైర్మన్ దేవేశ్వర్ మృతి దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అన్నారు. దేవేశ్వర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఐటీసీ ఛైర్మన్ మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటు: ట్విట్టర్​లో చంద్రబాబు, లోకేశ్

By

Published : May 11, 2019, 6:14 PM IST

ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్‌ మృతిపై చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ప్రముఖ పారిశ్రామికవేత్తను కోల్పోయిందని ట్విట్టర్​లో విచారం వ్యక్తపరిచారు. ఐటీసీని ప్రపంచస్థాయి సంస్థగా దేవేశ్వర్‌ తీర్చిదిద్దారని కొనియాడారు. దేవేశ్వర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్​లో పేర్కొన్నారు.

దేవేశ్వర్‌ దార్శనికత కలిగిన పారిశ్రామికవేత్తని మంత్రి లోకేశ్‌ అన్నారు. నాయకత్వ ప్రతిభతో ఐటీసీని ఉన్నతస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇవీ చూడండి-ఈ నెల 23 తర్వాత దేశానికి కొత్త ప్రధాని: కంభంపాటి

ABOUT THE AUTHOR

...view details