ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - మోదీ

ప్రతిపక్షాలపై మోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు. నిత్యం లక్షల రూపాయలు విలువ చేసే దుస్తులను వినియోగిస్తున్నది మోదీయేనని ఆరోపించారు. అప్పులపై జాతీయ స్థాయిలో ప్రధానితో తాను చర్చకు సిద్ధమని అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో సవాల్ చేశారు.

మోదీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

By

Published : May 2, 2019, 6:48 AM IST

మోదీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ప్రధాని పీఠంపై అశ పెట్టుకున్న ప్రతిపక్షాలు దుస్తులు కుట్టించుకుంటున్నారన్న మోదీ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. రూ. 10 లక్షల వ్యయమయ్యే సూటు, బూటు వేసుకునేది మోదీయేనని అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఆహారానికి తరచూ దుస్తులు మారుస్తూంటారని ఆరోపించారు. తామంతా సాధారణ దుస్తులే వేసుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రధాని పదవికి తాను పోటీదారు కాదని స్పష్టం చేశారు. మిగిలిన 3 దశల ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాయని తెలిపారు.


అప్పులపై ప్రధానితో చర్చకు సిద్ధం
అప్పులపై జాతీయ స్థాయిలో ప్రధానితో చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ చేశారు. కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇస్తే తాము అప్పు చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. 18 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్​తో ప్రయాణం ప్రారంభించామని గుర్తు చేశారు. 'తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ఏవైనా 4 గ్రామాలను తీసుకోండి. ప్రతిపక్ష నేతలతో పాటు విలేకరులు అక్కడకు వెళ్లి అభివృద్ధి ఎంతుందో పరిశీలించి రండి. పార్టీ ఖర్చులతోనే పంపిస్తాం' అని చంద్రబాబు వివరించారు.

ఇవి కూడా చదవండి: కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వండి: ఈసీకి సీఎం లేఖ

ABOUT THE AUTHOR

...view details