తనను రాజీనామా చేయాలని సవాల్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని.. సభా హక్కుల నోటీసు ఇచ్చింది తెదేపా. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు వడ్డీలేని రుణం పథకాన్ని అమలు చేయలేదని, ఐదేళ్లలో ఒక్క సంవత్సరం కూడా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయలేదని అసత్యాలు చెప్పినందుకు జగన్ శాసనసభ వేదికగా 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాజీనామా చేయాలన్నారు. ఆ పథకాన్ని అమలు చేశామంటూ... దానికి రుజువుగా కొన్ని పత్రాలను చంద్రబాబు విడుదల చేశారు.
సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన తెదేపా - ap assembly
తెదేపా హయాంలో రైతులకు వడ్డీలేని రుణం పథకాన్ని అమలు చేయలేదని, ఐదేళ్లలో ఒక్క సంవత్సరం కూడా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయలేదని అసత్యాలు చెప్పినందుకు సీఎం జగన్ శాసనసభ వేదికగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు స్పీకర్ కు ఇచ్చిన తెదేపా.
tdp