ఊరూరా సంబరం... పేదింటి కల సాకారం - HAPPY
రాష్ట్రంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. లబ్ధిదారులు తమ ఎన్నో ఏళ్ల కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు.
అద్దె ఇళ్లలో ఉండే పేదల కష్టాలు వర్ణనాతీతం. వచ్చే ఆదాయంలో సగం ఇంటి అద్దెలకే చెళ్లిస్తూ నిత్యం సమస్యలతో గడపాలి. సరైన వసతులు లేకున్నా, డబ్బు అంతా ఖర్చు అవుతున్నా తప్పదనుకుని భరించాలి. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేదల పాలిట వరంలా మారి... ఎన్నో ఏళ్ల సొంతింటి కళను సాకారం చేస్తుంది. నేడు ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అన్ని వసతులతో ప్రభుత్వం పంపిణీ చేసిన గృహాలను చూసి నిరుపేదలు సంబరాలు చేసుకుంటున్నారు.