రేపు గవర్నర్‌కు రాజపత్రం అందజేయనున్న ద్వివేది - governor
రేపు గవర్నర్ నరసింహన్తో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భేటీకానున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలతో కూడిన రాజపత్రాన్ని రేపు గవర్నర్‌కు ద్వివేది అందించనున్నారు.
రాష్ట్రంలో శాసన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 73 ప్రకారం ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘం రాజపత్రంగా ప్రచురించనుంది. గెలుపొందిన శాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కు సమర్పించాలని ఈసీ భావిస్తోంది. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో ఆదనపు సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మ గవర్నర్‌కు సమర్పించనున్నారు. గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వైకాపాను ఆహ్వానించనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గెలుపొందిన ఎమ్మెల్యేలకు సంబంధిత ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.