'భూములిచ్చేసి... సచివాలయానికి ఎలా వెళ్తావ్... సీఎం...' - capital farmers
స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తమ పరిస్థితి ఏంటని... ప్రభుత్వం ఇంత వరకు కౌలు వేయలేదని... చంద్రబాబును కలిసిన రాజధాని ప్రాంత రైతులు మొరపెట్టుకున్నారు. భవిష్యత్‌పై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం... మిగిలిన కట్టడాలపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
సీఎం జగన్‌పై రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహం
రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఆ ప్రాంత కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చేస్తామని బహిరంగంగా ప్రకటన చేస్తే తాము ముందుకొచ్చి తీసుకునేందుకు సిద్ధమని రైతులు ప్రకటించారు. తమకు భూములు ఇచ్చేసిన తర్వాత సచివాలయానికి సీఎం ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అక్కడ వేసిన రోడ్లు తమ భూముల మీదుగానే వేశారని గుర్తు చేశారు.