రైల్వే జోన్ ప్రకటనపై భాజపా నాయకుల హర్షం విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించడంపై భాజపా రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. జోన్ సాధన వెనకగతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి ఉందని చెప్పారు. జోన్ ఏర్పాటుపై రాజకీయం వద్దని ప్రత్యర్థి పార్టీలను కోరారు. ఎన్నికల తరుణంలో జోన్ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు తప్పని చెప్పారు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.