పల్లె కోయిల పాటకు... పది లక్షల వీక్షణలు - baby
యూట్యూబ్ స్టార్ బేబీ పసల ఆలపించిన 'మట్టిమనిషినండి నేను... మాణిక్యమన్నారు నన్ను' పాట పదిలక్షల మంది వీక్షించారు. రఘుకుంచే సంగీతమందించిన ఈ పాట రెండు రోజుల్లోనే ఈ రికార్డు సాదించడం విశేషం
'మట్టి మనిషినండి నేను... మాణిక్యమన్నారు నన్ను' అంటూ బేబీ పసల ఆలపించిన ఈ గీతం తెలుగునాట విస్తృత ప్రాచుర్యాన్ని పొందుతోంది. యూట్యూబ్లో విడుదలైన రెండు రోజుల్లోనే పది లక్షల వీక్షణలతో రికార్డు దిశగా దూసుకుపోతోంది. రఘు కుంచే సంగీతమందించిన ఈ పాటకు లక్ష్మీ భూపాల సాహిత్యాన్నందించారు.
వింటున్నంత సేపు బేబీ కోసమే పాటని రాశారా అన్నట్లు వర్ణించారు లక్ష్మీభూపాల. ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. చదువు లేదు... కూలికెళ్తేగాని పూట గడవదు... అలాంటి పరిస్థితుల్లో ఆమె దగ్గర ఉన్నదల్లా కోయిల లాంటి మధురమైన గాత్రం... ఆ గొంతుతోనే యూట్యూబ్ స్టార్ అయ్యారు మన బేబీ పసల. తన పాటలతో ప్రేక్షకులనే కాదు సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు సైతం అందుకుంది ఈ పల్లె కోయిల. ప్రస్తుతం ఈ పాట విజయంతో ఆమె మరో మెట్టెక్కిందంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పాట కోసం ఇచట వీక్షించండి