ETV Bharat / state
నిరుద్యోగ భృతి పెంపునకు సీఈసీ నిరాకరణ - cm
నిరుద్యోగ భృతి 2 వేలకు పెంచేందుకు ఈసీ అడ్డుకట్ట వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇది కుదరదని స్పష్టం చేసింది
యువనేస్తం
By
Published : Mar 30, 2019, 6:59 AM IST
| Updated : Mar 30, 2019, 7:34 AM IST
యువనేస్తం పెంపునకు ఈసీ అడ్డుకట్ట ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు ఇచ్చే భృతి మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ముగిసే వరకు నెలవారీ మొత్తాన్ని రెట్టింపు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఉత్తర్వులు పంపించింది. నిరుద్యోగులకు చెల్లిస్తున్న వెయ్యి రూపాయలను 2 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరగా...ఈ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. కోడ్ అమలులో ఉన్నందున పెంపునకు నిరాకరిస్తూ కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.అదే సమయంలో రాష్ట్రంలో ఇద్దరు సమాచార కమిషనర్ల నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్టీ ఎన్నికకూసీఈసీ పచ్చ జెండా ఊపింది. Last Updated : Mar 30, 2019, 7:34 AM IST