ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఎవరెటు? - ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కాపు కార్పొరేషన్ కు తొలిసారిగా.. ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించింది.

logo

By

Published : Jul 21, 2019, 5:25 AM IST

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గనుల శాఖ కార్యదర్శి గా బి.రాంగోపాల్ ను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ స్థానంలో పని చేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్ ను వస్త్ర, చేనేత పరిశ్రమల శాఖ విభాగం కార్యదర్శిగా బదిలి చేశారు. ఇసుక సరఫరా అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తటం, కొత్త ఇసుక విధానం లాంటి అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోని కారణాలే.. శ్రీనివాస శ్రీనరేష్ పై బదిలీ వేటు పడిన కారణంగా తెలుస్తోంది.

కాపు కార్పొరేషన్ ఎండీగా...

కాపు కార్పొరేషన్ ఇంఛార్జీ ఎండీ నాగభూషణం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎం.హరిందిరాప్రసాద్ ను నియమించారు. మొదటిసారి కాపు కార్పొరేషన్ ఎండీ పదవికి ఓ ఐఎఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరి కొందరు...

  • పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ అధికారి పి.కోటేశ్వరరావును విశాఖ మెట్రో రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ కమిషనర్ గా నియమించారు.
  • సి.నాగ రాణిని యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ గా నియమించారు.
  • ఎపీఐఐసీ ఈడీగా ఉన్న ఎం.హరినరాయణన్ ను సీసీఎల్ ఏ ప్రత్యేక కమిషనర్ గా నియమించారు. ఈ బాధ్యతల్లో భాగంగా... 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందని జీవోలో పేర్కోన్నారు. అటు ఏపీఐఐసీ ఈడీగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • పి.అరుణ్ బాబును పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా నియమించారు.
  • ఎం.విజయ సునీత, సీసీఎల్ ఏ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు.
  • లావణ్య వేణిని ఉపాధి, శిక్షణ డైరెక్టర్ గా నియమించారు.
  • మహేష్ కుమార్ రావిరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  • మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 91 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కలిగించారు.

ABOUT THE AUTHOR

...view details