ముఖ్యమంత్రితో సీఎస్ సుబ్రమణ్యం సమావేశం - ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం భేటీ అయ్యారు. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంపై ఇద్దరిమధ్యా చర్చ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం భేటీ అయ్యారు. రేపటి కేబినెట్ సమావేశంపైనే ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి.. ఇప్పటికే సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ.... కేంద్ర ఎన్నికల సంఘానికి నోట్ పంపించింది. కేబినెట్ సమావేశానికి 48గంటల ముందు ఈ వివరాలను పంపించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇవాళ సాయంత్రంలోగా ఈసీ నుంచి ఈ నివేదికపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.